నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ కళాశాలలో అల్పాహారం వికటించి 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను వెంటనే ఆర్మూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.