ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Apr 02, 2026, 08:04 IST/

రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారు: రామ్మెహన్ నాయుడు

Apr 02, 2026, 08:04 IST
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ ప్రవేశపెట్టడం తెలుగు ప్రజలందరికీ చరిత్రాత్మకమైన రోజని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు. చరిత్రలో అమరావతి ప్రజా రాజధానిగా గుర్తుండిపోతుందని తెలిపారు. విభజన సమయంలో ఏపీకి రూ.16వేల కోట్ల రెవెన్యూ లోటుతో పాటు రాజధాని లేకపోవడం సమస్యలకు దారితీసిందని, అయితే సీఎం చంద్రబాబు సంక్షోభాలను అవకాశాలుగా మలచుకుని ముందుకెళ్లారని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నాటకమాడి, అమరావతి ఉద్యమకారులను హింసించిందని ఆరోపించారు.