ఎమ్మెల్యే సమక్షం లో చేరిక

2చూసినవారు
ఎమ్మెల్యే సమక్షం లో చేరిక
గురువారం నాడు ఆర్మూర్ లోని ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి నివాసంలో పలువురు బీజేపీలో చేరారు. 6వ వార్డ్ నుండి పుట్టి మురళి దంపతులు, 19వ వార్డ్ నుండి త్రివేణి శ్రీకాంత్ దంపతులు, 25వ వార్డ్ నుండి వినయ్, 30వ వార్డ్ నుండి వినోద్ తమ 200 మంది అనుచరులతో కలిసి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలిచి చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్