బాద్గుణ గ్రామంలో జల్ ఆర్పన్ దివస్ కార్యక్రమం నిర్వహణ

2చూసినవారు
బాద్గుణ గ్రామంలో జల్ ఆర్పన్ దివస్ కార్యక్రమం నిర్వహణ
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం నందిపేట్ లోని బాద్గుణ గ్రామంలో శుక్రవారం జల్ ఆర్పన్ దివస్' కార్యక్రమం జరిగింది. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసిన నీటిని అందించాలని, తద్వారా అనారోగ్య సమస్యలను నివారించాలని సర్పంచ్ స్వప్న సుదన్ తెలిపారు. ఈ సందర్భంగా త్రాగునీటి వ్యవస్థను సొంత ఆస్తిగా భావించి, నీటిని పొదుపుగా వాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ సమర్థవంతంగా నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈ ప్రమోద్, ఉపసర్పంచ్ శివ, కార్యదర్శి శ్రావణ్, వార్డు సభ్యులు, మిషన్ భగీరథ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్