కామారెడ్డి: ఆర్టీసీ బస్సులో బంగారు నగలు మాయం

3చూసినవారు
కామారెడ్డి: ఆర్టీసీ బస్సులో బంగారు నగలు మాయం
కామారెడ్డి జిల్లా భి క్కనూరు మండలం జంగంపల్లి వద్ద ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలి బ్యాగులో దాచిన బంగారు నగలను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం సాయంత్రం చోరీ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంథని కి చెందిన మంజుల తన తల్లిగారి ఊరైన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ వెళ్లేందుకు కామారెడ్డి నుంచి రామయంపేటకు వెళ్లే లోకల్ బస్సు ఎక్కింది. బస్సు జంగంపల్లి వద్దకు రాగానే బ్యాగులో మూడు తులాల విలువైన నెక్లెస్ తో పాటు కమ్మలు ఉన్న బాక్స్ కనిపించకపోవడంతో షాక్ కు గురైంది. తోటి ప్రయాణికులు, కండక్టర్, డ్రైవర్ల సహాయంతో బస్సును భిక్కనూరు పోలీస్ స్టేషన్ కు తరలించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బస్సు ఎక్కి ప్రయాణికులను విచారించారు.