మూడు నెలల క్రితమే పెళ్లి.. దంపతుల ఆత్మహత్యాయత్నం

5చూసినవారు
మూడు నెలల క్రితమే పెళ్లి.. దంపతుల ఆత్మహత్యాయత్నం
ఆర్మూర్ పట్టణంలో మూడు నెలల క్రితం వివాహమైన రవితేజ, శోభ అనే దంపతులు గుర్తు తెలియని మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. శనివారం సాయంత్రం పట్టణ శివారులోని ఓ వెంచర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్