డొంకేశ్వర్ మండలంలోని తొండకూరు గ్రామంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ సర్వేను ఎంఆర్ఓ ప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాల నమోదు, అర్హులైన వారి పేర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియను ఆయన పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. బీఎల్‌ఓ వినోద్, జీపీఓ రాము, బీఎల్‌ఓ సూపర్వైజర్ సాయన్న, బీఎల్‌ఏ నాయకుడు గంగాధర్ పాల్గొన్నారు.