ఆర్మూర్ లో ఎంవీఐ రాహుల్ కుమార్ వాహనాల తనిఖీ

3చూసినవారు
ఆర్మూర్ లో ఎంవీఐ రాహుల్ కుమార్ వాహనాల తనిఖీ
మంగళవారం ఆర్మూర్ పట్టణంతో పాటు పెర్కిట్, మామిడిపల్లి గ్రామాల్లో ఎంవీఐ రాహుల్ కుమార్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ జరిగింది. పోలీసు కమిషనర్ సాయిచైతన్య, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దుర్గ ప్రమీలా ఆదేశాల మేరకు జరిగిన ఈ తనిఖీలో, ట్యాక్సులు చెల్లించని, ఫిట్నెస్ లేని ఆరు ప్రైవేట్ బస్సులను సీజ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తమ బస్సులను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కండిషన్లో ఉంచుకోవాలని, అతివేగంగా నడపకుండా రోడ్డు నిబంధనలు పాటించాలని ఎంవీఐ రాహుల్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్