నిజామాబాద్: లారీ బోల్తా.. ఒకరి మృతి, మరొకరికి గాయాలు

1256చూసినవారు
నిజామాబాద్: లారీ బోల్తా.. ఒకరి మృతి, మరొకరికి గాయాలు
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలో వేంపల్లి శివారులోని బైపాస్ వద్ద సంత్రాల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఆర్మూర్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న లారీ ప్రమాదానికి గురైంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మంగళవారం దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్