ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం రాత్రి నిషేధిత మాదక ద్రవ్వాలపై ఎస్ హెచ్ వో సత్యనారాయణగౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని పాతబస్టాండ్, కొత్త బస్టాండ్లో ప్రయాణికుల బ్యాగులను, హోటల్స్, పాన్షాపులతో పాటు పలు దుకాణాల్లో నిషేధిత మత్తు పదార్ధాల, ఇతర చట్ట విరుద్ధ వస్తువులను గుర్తించేందుకు శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్స్ ద్వారా తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తుల బ్యాగులను తనిఖీ చేశారు. ఎస్సై రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.