ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

4చూసినవారు
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు
వేల్పూర్ మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, కొబ్బరికాయలు కొట్టి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ చేసిన త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని, యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మండాది దయాకర్, ఉపాధ్యక్షుడు జమలగిరి గంగయ్య, ప్రధాన కార్యదర్శి సురేందర్, కోశాధికారి జమలగిరి రాజేందర్, మండల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్