నందిపేట్ లో కోతుల బెడద నివారించాలని వినతి

1031చూసినవారు
నందిపేట్ లో కోతుల బెడద నివారించాలని వినతి
నందిపేట్ పట్టణంలో కోతుల బెడద రోజురోజుకీ తీవ్రమైతున్నాది. జనావాసలలోకి వచ్చి ఇండ్లల్లో దూరి వస్తువులు చిందరవందరగా పడేస్తున్నాయి. మహిళలపై పిల్లలపై పెద్దలపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. అలాగే కుక్కల బెడదా కూడా ఉందని వాటిపై కూడా దృష్టి పెట్టాలని స్థానిక హనుమాన్ గల్లి యువత సర్పంచ్ ఎర్రం లింగంకి వినతి పత్రం ద్వారా తెలియజేయగా స్పందించిన ఆయన వీటిని నియంత్రించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే కోతులన్నీ పట్టించి అడవిలో వదిలేసేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్పారు. తాల్ల ధర్మపురి, త్రివేద్, సంతోష్, అరుణ్, విజయ్, అజయ్, కార్తీక్ లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్