వేల్పూర్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను జీట్టబొయ్ ఆనీల్, ఏత్తినొల్ల లస్యకు సర్పంచ్ కొనపత్రి సూజత అందజేశారు. ఈ సందర్భంగా CMRF చెక్కులు మంజూరు చేయడంలో సహకరించిన బాల్కొండ నియోజకవర్గం ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కు,
కాంగ్రెస్ సీనియరు నాయకులకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లబ్ధిదారుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేందర్,
కాంగ్రెస్ కార్యకర్తలు, మండల కమిటీ సభ్యులు ఆనందం, మహిపాలు, గంగాదరు, రాకేష్, సేక్రటరి మైపాల్ తదితరులు పాల్గొన్నారు.