అతిగా మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డ ఎనిమిది మందికి జరిమానా, జైలు శిక్ష పడింది. ఇటీవల స్టేషన్ పరిధిలో పట్టుబడ్డ వీరిని కోర్టులో హాజరుపరచగా, ఏడుగురికి ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున జరిమానా విధించారు. మరో వ్యక్తికి 4 రోజుల సాధారణ జైలు శిక్షను న్యాయమూర్తి సరళరాణి విధించినట్లు ఎన్హెచ్ చ్వే సత్యనారాయణ తెలిపారు.