ఆర్మూర్ పట్టణంలోని నిజాంసాగర్ కెనాల్‌లో పేరుకుపోయిన పూడిక వల్ల ప్రజలు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు ఆర్మూర్ నియోజకవర్గ
కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ కుమార్ రెడ్డిని కోరారు. ఆయన వెంటనే స్పందించి ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి పూడికను తొలగించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో పట్టణ ప్రజలు వినయ్ కుమార్ రెడ్డి తీసుకున్న చొరవను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన ఎప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు.