పడగల్ బిసి బాయ్స్ హాస్టల్ నుండి విద్యార్థి మిస్సింగ్

1441చూసినవారు
పడగల్ బిసి బాయ్స్ హాస్టల్ నుండి విద్యార్థి మిస్సింగ్
నిజమాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలోని బిసి బాలుర హాస్టల్లో ఉంటూ జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న రవితేజ(14) అనే విద్యార్థి గురువారం సాయంత్రం నుండి కనబడడం లేదని హాస్టల్ వార్డెన్ వేల్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారని వేల్పూర్ ఎస్సై సంజీవ్ తెలియజేశారు. విద్యార్థి ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కమలాన నెహ్రూ కాలనీకి చెందిన సునీత దంపతుల కుమారుడు. హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్