బిజెపి చేపట్టిన బస్సు యాత్రతో రాష్ట్ర ప్రభుత్వం కదులుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, అర్ముర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలిపారు. రైతు గోస
బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా రెండో రోజు భువనగిరి, ఆలేర్, జనగాం మార్కెట్ యార్డులలో ధాన్యాన్ని పరిశీలించారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు పూర్తి కావాల్సి ఉన్నా, నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని, రాష్ట్రంలోని పలుచోట్ల సుమారు 40 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయని పరిస్థితి నెలకొందని, అనేకచోట్ల రైతులు తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారని, ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న విధానాలు సరైనవి కావని ఎమ్మెల్యేలు విమర్శించారు.