కలెక్టర్ త్రిపాఠి ఆదేశాల మేరకు, జిల్లా అధికార యంత్రాంగం ధాన్యం కొనుగోళ్లపై క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, డీఎం సీఎస్‌సీ ప్రవీణ్, ఏసీఎస్వో గురువారం డొంకేశ్వర్ సొసైటీ పరిధిలోని నడ్కుడ, గాదెపల్లి, ఉమ్మెడ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను (PPCs) పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల ఇన్‌ఛార్జీలకు ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, నిల్వ ధాన్యాన్ని వెంటనే మిల్లర్లు తరలించాలని ఆదేశించారు.