శుక్రవారం సాయంత్రం డొంకేశ్వర్ మండలంలోని దత్తాపూర్, మారంపల్లి ప్రధాన రహదారి వద్ద వడ్ల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. మారంపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. లారీ పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు.