టిఆర్ఎస్ నేతలే టార్గెట్ గా అణిచివేత ధోరణి

3చూసినవారు
టిఆర్ఎస్ నేతలే టార్గెట్ గా అణిచివేత ధోరణి
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పోలీసులను అడ్డుపెట్టుకొని అరాచకానికి పాల్పడుతోందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆరోపించారు. పోలీసుల వక్రనీతిని నిరసిస్తూ గురువారం వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఆర్మూర్ ఏసీపీ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా, కాంగ్రెస్ లో చేరమని ఒత్తిడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఖద్దరు నేతలు, ఖాకీలు కలిసి బీఆర్ఎస్ నేతలను అణచివేస్తున్నారని, పోలీసు శాఖ కాంగ్రెస్ కు అనుబంధ సంస్థగా మారిందని ఆయన ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్