ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తాలో ఎంవీఐ వివేకానంద రెడ్డి వాహనాల తనిఖీ చేపట్టారు. మోర్తాడ్, కమ్మర్ పల్లి, భీంగల్, ఆర్మూర్ మండలాలకు చెందిన పాఠశాల బస్సులు, గూడ్స్ వాహనాలను తనిఖీ చేశారు. వాటికి ఫిట్నెస్ ఉన్నావా లేవా పేపర్లను పరిశీలించారు. సరైన పత్రాలు లేని రెండు వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.