పాత నేరస్థులపై నిఘా పటిష్టమ్

3చూసినవారు
పాత నేరస్థులపై నిఘా పటిష్టమ్
ఆర్మూర్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణపై పోలీస్ కమిషనర్ సాయిచైతన్య సమీక్ష నిర్వహించారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలలో రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిర్విరామంగా దాడులు నిర్వహించాలని, అవసరమైతే పి.డి. యాక్ట్ నమోదు చేయాలని సూచించారు. కమిషనరేట్ పరిధిలోని ఆర్మూర్ డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్