
నిజామాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్
తెలంగాణలో భానుడు భగభగమంటున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 41 నుంచి 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత, వడగాల్పుల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల ప్రజలు రాబోయే నాలుగు రోజులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.






































