17 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం

1చూసినవారు
కమ్మర్పల్లి మండల కేంద్రంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై సోమవారం మధ్యాహ్నం ఎన్ఫోర్స్మెంట్ సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ దాడులు నిర్వహించారు. గృహావసరాల కోసం వాడే సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించి, 11 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఏడుగురిపై కేసులు నమోదు చేసి, సిలిండర్లను కమ్మర్పల్లి శివారులోని ఇండియన్ గ్యాస్ గోదాంలో భద్రపరిచారు. ఈ దాడుల్లో వినోద్, ప్రవీణ్, పోలీసు సిబ్బంది వాల్మీకిగౌడ్, జీపీవోలు శ్రీకాంత్, గంగాధర్, అజయ్, సాయిరాం పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్