కిసాన్ నగర్ లో గణపతికి ఘన వీడ్కోలు

3చూసినవారు
కిసాన్ నగర్ లో గణపతికి ఘన వీడ్కోలు
నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బుధవారం గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఘనంగా జరిగింది. నిమజ్జనానికి ముందు మండపాలను విద్యుత్ దీపాలు, పూలమాలలతో అలంకరించారు. భక్తులు ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు నరేందర్, ఉపాధ్యక్షుడు మోహన్, కార్యదర్శి జిందం రాజు, సలహాదారుడు శివకుమార్, సర్పంచ్ రామ్ రాజ్ గౌడ్, ఉపసర్పంచ్ స్వామి నాథ్, సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్