బాల్కొండలో అక్రమ ఇసుక రవాణాపై చర్యలు

968చూసినవారు
బాల్కొండలో అక్రమ ఇసుక రవాణాపై చర్యలు
నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండల కేంద్రంలోని శ్రీరాంపూర్ గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను బాల్కొండ ఎస్సై కే శైలేందర్ అదుపులోకి తీసుకున్నారు. మోర్తాడ్ మండలం శెట్పల్లి గ్రామం నుండి శ్రీరాంపూర్ గ్రామానికి ఇసుకను తరలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటన 2026 ఏప్రిల్ 28న జరిగింది.

సంబంధిత పోస్ట్