విద్యుత్ వాడకంపై రైతులకు అవగాహన కల్పించిన ఏఈ కిషన్

673చూసినవారు
బాల్కొండ మండల కేంద్రంలో శుక్రవారం విద్యుత్ వినియోగంపై రైతులకు, వినియోగదారులకు అవగాహన కల్పించారు. ఏఈ కిషన్ మాట్లాడుతూ ఎల్ఈడి బల్బులు, నాణ్యమైన ఐఎస్ఐ స్టార్ రేటింగ్ విద్యుత్ పరికరాలు వాడాలని సూచించారు. సర్వీస్ వైర్, వీధిదీపాలు, విద్యుత్ స్తంభాల వద్ద ప్రైవేట్ వ్యక్తులు ఎక్కరాదని, రైతుల అవసరాలకు లైన్ మ్యాన్ ను సంప్రదించాలని తెలిపారు. ఎలక్ట్రిక్, వాటర్ హీటర్లకు బదులుగా సోలార్ వాటర్ హీటర్లు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్, ఏ.ఎల్.ఎమ్, రైతులు, వినియోగదారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్