
మరికాసేపట్లో ఐసెట్ ఫలితాలు విడుదల
తెలంగాణ ఐసెట్ ఫలితాలు ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను అభ్యర్థులు https://icet.tgche.ac.in/ వెబ్సైట్లో తమ హాల్‌టికెట్ నంబర్‌తో పొందవచ్చు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ నిర్వహించిన ఈ పరీక్ష మే 13, 14 తేదీల్లో జరిగింది. అధికారులు ఇప్పటికే ప్రిలిమినరీ కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించారు. షెడ్యూల్ కన్నా ముందే ఫలితాలు విడుదలవుతున్నాయి.




