నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో బుధవారం బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమ్మవార్లకు పూజలు చేసి, బోనాలను బాల్కొండ ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. గ్రామంలోని పెద్దపోచమ్మ, మహాలక్ష్మి, ఐదు చేతుల పోచమ్మ, నల్ల పోచమ్మ, పెద్దమ్మ దేవాలయాలకు వెళ్లి పలు రకాల నైవేద్యాలు సమర్పించారు.
విద్యార్థులు చేసిన పోతురాజుల విన్యాసం అతిథులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు విఘ్నేశ్వర్, ఆకుల లక్ష్మణ్, ప్రిన్సిపాల్ విజయ్ కర్తన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.