ఎండు గంజాయి తరలింపు.. వ్యక్తిపై కేసు

4చూసినవారు
ఎండు గంజాయి తరలింపు.. వ్యక్తిపై కేసు
భీమ్గల్ మండలంలోని సంతీష్నగర్ తండా సమీపంలో శుక్రవారం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 100 గ్రాముల ఎండు గంజాయిని తరలిస్తున్న షేక్ మాజస్ అనే వ్యక్తిని అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుండి ఒక మొబైల్ ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. గంజాయికి బానిసలైన ముగ్గురు వ్యక్తులకు, వారి తల్లిదండ్రుల సమక్షంలో గంజాయి సేవించడం వల్ల కలిగే అనర్థాలపై అధికారులు అవగాహన కల్పించారు. అనంతరం వారిని తహసీల్దార్ ముందు బైండోవర్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్