కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2027 జనాభా గణనలో భాగంగా, నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని ముప్కాల్ మండల కేంద్రంలో సోమవారం మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఛార్జ్ ఆఫీసర్ తహసీల్దార్ ముంతాజ్ బుద్దీన్, అడిషనల్ ఛార్జ్ ఆఫీసర్ విద్యాధికారి ఎం గంగారాం పర్యవేక్షణలో మాస్టర్ ట్రైనర్ ప్రవీణ్ రెడ్డి, మల్లికార్జున్ మండల ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లకు శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సిబ్బంది పాల్గొన్నారు.