మధ్యాన్నం భోజనం తనిఖీ

2చూసినవారు
కమ్మర్ పల్లి మండలం బషీరాబాద్ గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని గ్రామ సర్పంచ్ బైకన్ జమున మహేష్, ఉప సర్పంచ్ చిలువేరి భూమేశ్వర్ పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. తాగునీటి ప్యూరిఫైయర్ పనిచేయడం లేదని ఉపాధ్యాయులు దృష్టికి తీసుకురాగా, సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్