
బంగారం సంపదను కాపాడే రక్షణ కవచం: కియోసాకి
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన 'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత రాబర్ట్ కియోసాకి కరెన్సీలను భ్రమగా, నకిలీ డబ్బుతో సమానమని అభివర్ణించారు. ప్రభుత్వాలు ముద్రించే డాలర్లు, ఇతర కరెన్సీలపై నమ్మకం లేకే తాను జీవితాంతం బంగారం, వెండిని కొనుగోలు చేస్తున్నానని ఆయన తెలిపారు. బంగారం సంపదను అంతరించిపోకుండా కాపాడే రక్షణ కవచమని, సామాన్యులు కూడా చిన్న మొత్తంలో బంగారం, వెండి కొనుగోలుతో సంపద రక్షణ ప్రారంభించవచ్చని కియోసాకి సూచించారు.




