ఆటో యూనియన్ల మధ్య ఘర్షణ

3చూసినవారు
ఆటో యూనియన్ల మధ్య ఘర్షణ
శుక్రవారం ముప్కాల్ ఆటో పాయింట్ వద్ద మెండోరా, ముప్కాల్ ఆటో యూనియన్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నాలుగేళ్ల క్రితం మెండోరా మండలానికి చెందిన ఆటోలు ముప్కాల్ మండలానికి రావద్దని ముప్కాల్ యూనియన్ హెచ్చరించడంతో, మెండోరా ఆటోలు ముప్కాల్‌కు వెళ్లకుండా బుస్సాపూర్ వరకు మాత్రమే ప్రయాణికులను చేరవేస్తున్నాయి. గతంలో అధికారులు ఇరు యూనియన్ల సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి, ఎవరి మండలంలో వారు ఆటో పాయింట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వ్యాపారాలు దెబ్బతింటున్నాయని మెండోరా యూనియన్ నాయకులు ముప్కాల్ సర్పంచ్‌కు తెలపడంతో, ఇరు మండలాలకు చెందిన కొన్ని ఆటోలను మాత్రమే అనుమతించాలని తీర్మానించారు. ప్రస్తుతం మళ్లీ ముప్కాల్ వస్తున్నారని బెదిరిస్తున్నారని మెండోరా యూనియన్ సభ్యులు ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. విద్యార్థులకు సంక్రాంతి సెలవులున్నందున, వారిని క్షేమంగా గ్రామాలకు చేర్చాలని సీఐ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్