పదో తరగతి ఫలితాలు: భీంగల్ విద్యార్థుల అద్భుత ప్రతిభ, 98% ఉత్తీర్ణత

552చూసినవారు
పదో తరగతి ఫలితాలు: భీంగల్ విద్యార్థుల అద్భుత ప్రతిభ, 98% ఉత్తీర్ణత
నిజామాబాద్ జిల్లా, బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ పట్టణంలో బుధవారం ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో భీంగల్ మండల విద్యార్థులు 98% ఉత్తీర్ణత సాధించి అద్భుత ప్రతిభ కనబరిచారు. మొత్తం 813 మంది పరీక్షలు రాయగా, 800 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 403, బాలికలు 397 మంది ఉన్నారు. బి. వెంకట హరిణి 577 మార్కులతో ప్రథమ స్థానం సాధించగా, ఎం. సాయి స్మైలికా 576, కే. రఘు, పి. లక్ష్మీ ప్రణతి 575 మార్కులు సాధించారు. 456 మంది విద్యార్థులు 500కి పైగా మార్కులు పొందారు. 18 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయి.

సంబంధిత పోస్ట్