నిజామాబాద్ జిల్లా బాల్కొండ పట్టణ కేంద్రంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డికి
కాంగ్రెస్ నాయకులు బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. బాల్కొండ పట్టణ అధ్యక్షులు కుందారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సట్ల ప్రవీణ్, కార్యదర్శులు నవీన్, పద్మారావు, పుప్పాల విద్యాసాగర్, దొంపాల్ సాయన్న, రవీందర్ గౌడ్, రాజ్ కుమార్, డిసిసి ఉపాధ్యక్షులు చాట్ల నరేష్, డిసిసి కార్యదర్శి యునుస్, ప్రవీణ్ గౌడ్, సీనియర్ నాయకులు గడ్డం రవి, షేక్ వహాబ్, బండి మల్లేష్, మేక నాగేష్, నానం నరేష్, షేరు, కుమ్మరి గంగాధర్, నల్లమందు రాజలింగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైయస్సార్ కు నివాళులు అర్పించి, ఆయన సేవలను స్మరించుకున్నారు.