వ్యవసాయ మోటార్ల కాపర్ వైర్లు చోరీ

0చూసినవారు
వ్యవసాయ మోటార్ల కాపర్ వైర్లు చోరీ
వేల్పూర్ మండలంలోని పచ్చలనడ్కుడ గ్రామంలో మంగళవారం సాయంత్రం వరకు పంటలకు నీరు పారించిన రైతులు, బుధవారం ఉదయం తమ తోటల్లోని 27 వ్యవసాయ విద్యుత్ మోటార్ల వద్ద ఉన్న కాపర్ వైర్లు కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. గుర్తు తెలియని వ్యక్తులు ప్రతి మోటార్ వద్ద సుమారు 5 నుంచి 10 మీటర్ల పొడవు వరకు ఉన్న కేబుల్ వైర్లను కత్తిరించి దొంగిలించినట్లు రైతులు తెలిపారు. ఖరీఫ్ పంటల సాగు సమయంలో ఇలా జరగడం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్