వడగళ్ల వానతో పంట నష్టం: రైతులకు తక్షణ సాయం డిమాండ్ చేసిన MPR

141చూసినవారు
సాలూర మండలంలోని హున్స, మందర్న, ఖాజాపూర్ గ్రామాలలో కురిసిన వడగళ్ల వానతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి (MPR) నష్టపోయిన పంటలను పరిశీలించి, రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేసి, తక్షణ సహాయం, సరైన పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. పసల బీమా యోజన అమలు చేసి ఉంటే రైతులకు ఉపయోగపడేదని, రైతు బంధు అందకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. రైతుల కోసం మాటలకే పరిమితం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్