
సినిమా ఆడిషన్స్ కు వచ్చి గుండెపోటుతో వ్యక్తి మృతి
సినిమాలపై మక్కువతో విశాఖపట్నం నుంచి బంజారాహిల్స్ లోని సినిమా కార్యాలయానికి ఆడిషన్స్ కోసం వచ్చిన వాడపల్లి సంజయ్ (55) అనే వ్యక్తి, ఆడిషన్స్ జరుగుతుండగా బయట కుర్చీలో కూర్చుని ఉన్నప్పుడు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలి మృతి చెందారు. ఈ ఘటన సినిమా రంగంలో విషాదాన్ని నింపింది.




