నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో ఆదివారం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న సాయికుమార్ (32,000), హీజూ (30,000), వినోద (20,000), గంగు (16,000) లకు
కాంగ్రెస్ నాయకులు చెక్కులను అందజేశారు. ఈ సహాయం పేద కుటుంబాలకు ఉపయోగపడుతుందని, అందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు గంగాధర్, డీసీసీ డెలికేట్ కపిల్ కుమార్, కార్యదర్శి హనుమంతు, ప్రధాన కార్యదర్శి నగేష్, సీనియర్ నాయకులు సవీన్, నరేందర్, హమీద్, బూపిరెడ్డి, రాజలింగం తదితరులు పాల్గొన్నారు.