ముప్కాల్ మండలంలోని వేంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులలో భాగంగా జాబ్ కార్డులు పంపిణీ చేశారు. కార్డులు లేని వారి కుటుంబాలకు నూతన జాబ్ కార్డులు మంజూరు చేశారు. శుక్రవారం మండల ఎంపీడీఓ బి. రమేష్, సర్పంచ్ మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వార్డు సభ్యురాలు బట్టు మాధురి, కార్యదర్శి నరేష్, ఫీల్డ్ అసిస్టెంట్ జగదీశ్, లబ్ధిదారులు పాల్గొన్నారు.