కొత్తపల్లి కేజీబీవీ పాఠశాలలో ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం

650చూసినవారు
కొత్తపల్లి కేజీబీవీ పాఠశాలలో ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం
ముప్కాల్ మండలంలోని కొత్తపల్లి కేజీబీవీ పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన "ఏక్ పేడ్ మాకే నామ్"కార్యక్రమాన్ని చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ పచ్చదనం పట్ల ఆకర్షణ ప్రకృతి పట్ల విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ప్రిన్సిపాల్ వినోద తెలిపారు. ఈ సందర్భంగా ప్రతీ విద్యార్థి అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్