రెంజర్ల జడ్పీహెచ్ఎస్ లో ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం

6చూసినవారు
రెంజర్ల జడ్పీహెచ్ఎస్ లో ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం
నిజామాబాద్ జిల్లా, బాల్కొండలోని ముప్కాల్ మండలంలోని రెంజర్ల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడం ప్రతి విద్యార్థి తన తల్లి పేరు మీద ఒక మొక్కను నాటి దానిని సంరక్షించే బాధ్యతను తీసుకోవడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. హెచ్ఎం జే. రవికుమార్ ఆధ్వర్యంలో 8వ, 9వ తరగతుల విద్యార్థులు పది మొక్కలను నాటారు. గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని ఉపాధ్యాయుడు రవికుమార్ కోరారు.

సంబంధిత పోస్ట్