ముప్కాల్ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కార్యక్రమం జరిగింది. సీఐ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని, గ్రామాభివృద్ధికి సర్పంచ్ పదవికి సరైన నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందికి గ్రామస్తులు, నాయకులు అభినందనలు తెలిపారు.