నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని బాల్కొండ మరియు వన్నెల్(బి) రైతు వేదికలో బుధవారం ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సాగు విధానాలు, రాయితీలపై నిపుణులు రైతులకు అవగాహన కల్పిస్తారని బాల్కొండ డివిజనల్ ఉద్యాన అధికారి రుద్ర వినాయక్ తెలిపారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని లబ్ది పొందాలని ఆయన కోరారు.