భూ భారతి, భూముల రీ సర్వేపై రైతులకు అవగాహన

6చూసినవారు
భూ భారతి, భూముల రీ సర్వేపై రైతులకు అవగాహన
నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామ రైతులకు భూ భారతి, భూముల రీ సర్వేపై అవగాహన కల్పించారు. సర్వే అండ్ రికార్డ్ డీఈ శ్రీనివాస్ మాట్లాడుతూ, రైతుల భూముల పట్ల అవకతవకలు జరగకుండా ఎల్బీఎం తో పాటు భూ ఆధార్ కార్డును కేటాయిస్తామని, దీని ద్వారా ప్రభుత్వ పథకాలు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్ఆర్ఓ శ్రీనివాస్, ఏఓ లావణ్య, కిసాన్ నగర్, వేంపల్లి సర్పంచులు రామరాజు గౌడ్, ఎట్టం మహేష్ యాదవ్, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్