నిజామాబాద్ జిల్లా, బాల్కొండలో ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన ఫామ్‌పాండ్‌లను చేపల పెంపకానికి ఉపయోగించి అదనపు ఆదాయం పొందుతున్న రైతులను డీఆర్‌డీఓ పి. డి సాయన్న బుధవారం పరిశీలించారు. తక్కువ భూమిలోనూ వినూత్న పద్ధతులు అవలంబించడం ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని, ఫామ్‌పాండ్‌లను చేపల పెంపకానికి వినియోగించుకోవడం ఆర్థికంగా లాభదాయకమని ఆయన తెలిపారు. ఈ సాగు విధానాన్ని పరిశీలించేందుకు సిరికొండ మండలానికి చెందిన రైతులు ఆయన వెంట ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీలు గంగమోహన్, ఓంపాల్, ప్లాంటేషన్ మేనేజర్ కపిల్, ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి, ఎంపీఓ ఇందిరా, కార్యదర్శి మోహన్, సర్పంచ్ రాజేష్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.