వేంపల్లిలో నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ

504చూసినవారు
వేంపల్లిలో నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ
నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండలం వేంపల్లి గ్రామంలోని పురాతన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నాడు ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. దేవాలయ కమిటీ అధ్యక్షులు బొత్తమొల్ల నరేష్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ సందర్భంగా హోమం, స్వామివారి పల్లకి సేవ, కళ్యాణం నిర్వహిస్తారు. శుక్రవారం ఉదయం అన్న ప్రసాద వితరణ ఉంటుంది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్, పాలకవర్గం, వీడీసీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ వేడుకలు శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి సందర్భంగా జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్