శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద తగ్గుముఖం పట్టడంతో, ప్రాజెక్టు నాలుగు వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఎస్ఈ జగదీష్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 21,954 క్యూసెక్కుల వరద చేరుతుండగా, 4 వరద గేట్ల ద్వారా 12,500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 8,000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 573 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 1091 అడుగులు, 80 టీఎంసీల నీటి నిల్వ ఉంది.