నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండలం కిసాన్ నగర్ లోని లయన్స్ క్లబ్ భవనంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్య అధికారి డాక్టర్ పుణ్య రాజు 30 మందికి కంటి
పరీక్షలు నిర్వహించారు. వీరిలో మోతి బిందు ఉన్న వారిని గుర్తించి, శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకు లింగం, జోనల్ చైర్మన్ సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.